వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, వినుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో స్థానిక 11వ వార్డు రైలుపేట నుంచి మదమంచి పాడు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా కూటమి నాయకులు మునయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్రను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన ఇంఛార్జి నాగ శ్రీను రాయల్, మండల నాయకులు, వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.