• అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్య బాధాకరం. కర్ణాటక వెళ్లి తిరిగివస్తున్న ఆదెప్పను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు అతనిపై కత్తులతో దాడి చేసి నరికి చంపారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీ రౌడీ మూకలు పయనిస్తున్నారు. అరాచకపాలనను భరించలేక ప్రజలు ఛీకొట్టినా జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాస్తూనే ఉన్నాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ 9 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారు. గ్రామంలో ఆలయ అర్చకత్వం విషయంలో ఆదెప్పతో గొడవ పడిన వైసీపీ కార్యకర్తలు అతనిపై కక్ష పెట్టుకుని మాటు వేసి హతమార్చారు. మృతుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.