ఎస్పీల నియామకానికి ఈసీకి ప్యానల్‌

అమరావతి, మహానాడు: ఎన్నికల అనంతరం హింసపై వేటు వేసిన పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఐదుగురు సభ్యుల ప్యానల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. సాలి గౌతమి(విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌), మల్లికా గార్గ్‌(సీఐడీ, ఎస్పీ), వి.హర్షవర్దన్‌రాజు(సీఐడీ, ఎస్పీ), డి.నరసింహకిషోర్‌, తిరుపతి, టీటీడీ సీవీ అండ్‌ ఎస్‌ఓ), కె.శ్రీనివాసరావు (విజయవాడ జగ్గయ్యపే ట డీసీపీ)లతో ప్యానల్‌ పంపింది.