విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో కార్యనిర్వాహణాధికారి కె.ఎస్.రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యతను వివరించారు.