‘ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పరిటాల’

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద‌ల కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారన్నారు. నమ్మినవారి కోసం నిలబడే ప్రజానేతగా ప్రజల గుండెల్లో పరిటాల రవీంద్ర శాశ్వితంగా నిలిచిపోయారన్నారు. సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గ‌ర్జించారు.. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారన్నారు. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత అని ఈ సందర్భంగా గుర్తు చేసారు.