పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయాలి

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పట్టుభద్రుల ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది, కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓట్లు నమోదు చేయాలన్నారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో 18 వేలకు పైగా పట్టుభద్రుల ఓటుర్లు ఉన్నారని, వారితో పాటుగా కొత్తగా అర్హులైన వారందరిని కూడా ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు.

2021వ తేదీ అక్టోబర్ నాటికి కావలసిన విద్యార్హతలు పూర్తి చేసుకున్నవారు మాత్రమే ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా ఆలపాటి రాజాను ప్రకటించడం జరిగిందని, ఆయన్ను అత్యధిక ఓట్ల మోజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు ఓటర్ నమోదును చేయాలన్నారు.