Mahanaadu-Logo-PNG-Large

పాస్ పుస్తకాలు త్వరతగతిన అందించాలి

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం, మహానాడు: భూ యజమానులకు పాస్ పుస్తకాల కోసం నెలలు తరబడి తిప్పుతున్నారు… ఆ విధానానికి స్వస్తి పలికి సులభతరంగా ప్రజలకు పాస్ పుస్తకాలు అందించేందుకు కృషి జరగాలి. తమ పొలాలను అమ్ముకున్నప్పుడు సర్వేలు కొలతలకు రావడానికి కాలయాపన చేస్తున్నారు… అలాంటి పరిస్థితులన్నీ మారాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అధికారులనుద్దేశించి అన్నారు. ప్రకాశం భవన్ నందు కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సు లో జిల్లా మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, శాసనసభ్యులతో ఆమె పాల్గొని మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఈ నెల 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం…. 90 రోజుల టార్గెట్‌ ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు చేయడమే. ముఖ్యంగా ప్రజలకు రెవెన్యూ శాఖ తోటే ఎక్కువగా పనులు ఉంటాయి. భూవివాదాలు పొలాల తగాదాలు ఆన్లైన్లో ఎక్కడ పోవడం లోన్లు తీసుకోవడానికి ఆటంకాలు భూముల అమ్ముకునేటప్పుడు రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు వీటన్నింటినీ పరిష్కరించాల్సింది రెవెన్యూ సిబ్బంది మాత్రమే… చిన్న చిన్న పనులు కోసం రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిప్పుకునే సాంప్రదాయానికి స్వస్తి పలకాలన్నారు.

తమ పొలం అమ్ముకుంటే రిజిస్టర్ అవ్వాలంటే ఆన్లైన్లో తన పొలం కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మార్వో డిజిటల్ సైన్ పేరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది మారినప్పుడల్లా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ఎవరి పొలం పై వారికి హక్కు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులన్నీ మారాలి… ముఖ్యంగా అసైన్డ్ భూములు పూర్వికులు నుండి వస్తున్న పట్టా భూములు, డీకే పట్టాలు ఆక్రమించుకున్న భూములు వీటన్నింటిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

ముఖ్యంగా మా దర్శి ప్రాంతంలో అనేక గ్రామాలలో పూర్వికులు నుండి సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్లు మాత్రం అవడం లేదు. కొన్నిచోట్ల పాస్ బుక్ అయితే ఇచ్చారు. లోన్లు తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రిజిస్టర్లు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వం లో అందరు నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని, వాటిపై కూడా సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని పేదలకు ఆ భూములు అందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.