పసుపుమయంగా వినుకొండ

టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్‌

వినుకొండ, మహానాడు : వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జి.వి.ఆంజనేయులు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కరెంట్‌ ఆఫీస్‌ దగ్గర నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్ర మంలో అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్‌చార్జ్‌ కొంజేటి నాగశ్రీను, ఉమ్మడి జిల్లా జనసేన కోఆర్డినేటర్‌ నిశ్శంకర శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేడం రమేష్‌, నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివ ప్రసాద్‌రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.