రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

– ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా

రౌతులపూడి, మహానాడు: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా సందర్శించారు.. ఆసుపత్రి లో వివిధ వార్డ్ లలో వైద్యం పొందుతున్న రోగులను ఆమె పరామర్శించారు. అధికశాతం మంది రోగులు అతిసారా (డయేరియా ), వైరల్ ఫివర్ వంటి లక్షణాల తో బాధ పడుతున్నారని అక్కడ వైద్య బృందం ఎమ్మెల్యేకి తెలిపారు.

బెడ్స్ పై ఇద్దరు, ముగ్గురు రోగులు ఉన్న పరిస్థితి ని గమనించిన ఎమ్మెల్యే వైద్య బృందాన్ని వివరణ కోరారు. ఆసుపత్రి లో అదనపు భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌లకు బిల్లులు ప్రభుత్వం ల్లించకపోవడంతో ఆ తాళాలు వేశారని ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆసుపత్రి పరిస్థితి, జరిగిన ఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే వైద్య బృందం ను కోరారు. కార్యక్రమంలో ఎన్డీయే శ్రేణులు పాల్గొన్నారు.