ఉపముఖ్యమంత్రిగా పవన్‌కళ్యాణ్‌…

24 మందితో చంద్రబాబు మంత్రివర్గం
17 మంది కొత్త వారికి అవకాశం
టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 1
సమతూకం పాటించిన టీడీపీ అధినేత
మొత్తంగా ముగ్గురు మహిళలకు స్థానం
వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి చోటు
మరోసారి నారా లోకేష్‌కు పదవి

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రి వర్గాన్ని ఎంపికచేశారు. వారితో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పవన్‌కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మంత్రుల జాబితాకు సంబంధించి జనసేనకు 3 పదవులు, బీజేపీకి 1 కేటాయించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్త వారే ఉన్నారు. 17 మందికి అవకాశం కల్పించారు. సామాజికవర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. బీసీలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరు, ఆర్యవైశ్యుల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. మొత్తంగా వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సీనియర్లు, యువ నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రి వర్గాన్ని ఎంచుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నెలబెట్టుకున్నారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారని, సామాజిక సమీ కరణాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని కూటమి వర్గాలు చెబుతున్నాయి.

కొత్త మంత్రుల జాబితా ఇదే

1. కొణిదెల పవన్‌కల్యాణ్‌(కాపు)
2. నారా లోకేష్‌(కమ్మ)
3. కింజరాపు అచ్చెన్నాయుడు(బీసీ, కొప్పుల వెలమ)
4. కొల్లు రవీంద్ర(బీసీ, మత్స్యకార)
5. నాదెండ్ల మనోహర్‌(కమ్మ)
6. పొంగూరు నారాయణ(కాపు)
7. అనిత వంగలపూడి(ఎస్సీ, మాదిగ)
8. సత్యకుమార్‌ యాదవ్‌(బీసీ, యాదవ్‌)
9. నిమ్మల రామానాయుడు(కాపు)
10. ఎన్‌ఎండీ ఫరూక్‌(ముస్లిం మైనారిటీ)
11. ఆనం రామనారాయణరెడ్డి(రెడ్డి)
12. పయ్యావుల కేశవ్‌(కమ్మ)
13. అనగాని సత్యప్రసాద్‌(బీసీ, గౌడ)
14. కొలుసు పార్థసారథి(బీసీ, యాదవ)
15. డోలా బాల వీరాంజనేయస్వామి(ఎస్సీ, మాల)
16. గొట్టిపాటి రవికుమార్‌(కమ్మ)
17. కందుల దుర్గేష్‌(కాపు)
18. గుమ్మడి సంధ్యారాణి(ఎస్టీ)
19. బీసీ జనార్ధనరెడ్డి(రెడ్డి)
20. టీజీ భరత్‌(ఆర్యవైశ్య)
21. ఎస్‌.సవిత(బీసీ, కురబ)
22. వాసంశెట్టి సుభాష్‌(బీసీ, శెట్టిబలిజ)
23. కొండపల్లి శ్రీనివాస్‌(బీసీ తూర్పు కాపు)
24. ముండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి(రెడ్డి)