పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ పవన్ కల్యాణ్ మనసులో ప్రత్యేక స్థానం

-పవన్ కల్యాణ్ లాంటి విప్లవ భావాలున్న నాయకులు అరుదుగా ఉంటారు
-పవన్ కల్యాణ్ చేసే ప్రతీ ఆలోచన, ప్రజల కోసమే
-వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు
-జనసైనికుల, వీరమహిళల పోరాటం స్ఫూర్తి దాయకం
-దేశానికి మోదీ,రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ భావించారు
-కూటమిని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు 
-జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు

మహానాడు: జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ పవన్ కల్యాణ్ మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి  శుక్రవారం నాగబాబుని ప్రత్యేకంగా కలిశారు.

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ చేసిన పోరాటాలు , ప్రజా సమస్యలపై అవలంభించిన విధానాలపై  సుమారు అరగంటకుపైగా ఇరువురి మధ్య చర్చ  జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ లాంటి విప్లవ భావాలున్న నాయకులు అరుదుగా ఉంటారన్నారు. పవన్ కల్యాణ్ ప్రతీ ఆలోచన , ప్రతీ అడుగు సమాజం , దేశం చుట్టూ తిరుగుతాయని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చూపిన బాటలో నడవటం అందరికీ గర్వకారణంగా ఉందంటూ పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గాలను , దాష్టీకాలను ఎదురుకోవటం సామాన్యమైన విషయం కాదన్నారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యులైన జనసైనికులను , వీరమహిళలను ప్రజలెప్పటికీ మరచిపోరన్నారు. పవన్ కల్యాణ్ ఏం చేసినా , ఎలాంటి వ్యూహం పన్నినా అది అంతిమంగా అందులో ప్రజా శ్రేయస్సు దాగుంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మోదీ , రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ భావించారన్నారు.  పవన్ కల్యాణ్  త్యాగాలను , ఉన్నతమైన , విశాలమైన భావాలను ప్రజలు అర్ధం చేసుకున్నారనీ  అందుకే  కూటమికి చారిత్రాత్మక విజయాన్ని ప్రజలు అందించారని హర్షం వ్యక్తం చేశారు.

కూటమి నేతృత్వంలో ప్రజారంజక పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూడబోతున్నారన్నారు.  మెగాఫ్యామిలీని అభిమానిస్తూ మూడు దశాబ్దాలుగా తమతో నడుస్తున్న అభిమానులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని నాగబాబు అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ కోసం బాగా కష్టపడుతున్నావంటూ నాగబాబు  ఆళ్ళ హరిని.భుజం తట్టి అభినందించారు.