ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?
ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు?
రాజంపేట వైసీపీ ఎంపి మిథున్‌రెడ్డి సవాల్
రాజంపేట: పవన్‌కళ్యాణ్‌గారు.. దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. మీరు అధికారంలో ఉన్నారు. పోలీసులు, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడే కాదు.. పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమరవాణాపై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. చివరకు సత్యశోధన పరీక్షకైనా నేను రెడీ. ఐదేళ్లపాటు మీకు సమయం ఉంది. ఆరోపణలను నిరూపించలేకపోతే బహిరంగంగా మీరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?