అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం దీక్షను పుచ్చుకోనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెళతారు. గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేయనున్నారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలినమైంది. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం.. హైందవ జాతికే కళంకం. కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.