కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఏక్నాళథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ తదితరులు హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.