– ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
విస్సన్నపేట, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విన్నవించగా ఎమ్మెల్యే స్పందించారు. గ్రామ సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి
తో చర్చించి కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కార్మికులకు ఘనంగా సత్కరించి కాళ్ళకి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు గౌరవ స్థానం కల్పిస్తూ సన్మానించిన ఎమ్మెల్యే కొలికపూడి లాంటి నాయకుడిని మునిపెన్నడు చూడలేదని అన్నారు. అనంతరం స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎన్నారై కనకపూడి రామారావు సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆర్గనైజర్ అప్పికట్ల కుమార్ జన్మదిన వేడుకల్లో కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.