జీతాలు చెల్లించండి మహాప్రభో!

రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పక్షాన డిమాండ్‌
అధికార నేతలను నిలదీయాలని పిలుపు

తిరుపతి, మహానాడు : జీతాలు పడక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తం గా అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌, ఉద్యానవన, ఎస్వీయూ ప్రొఫెసర్స్‌, రెగ్యులర్‌ ఉద్యోగస్తులకు, టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌, టైం స్కేల్‌ ఎన్‌ఎంఆర్‌లు, హాస్టల్‌ ఉద్యోగులు, నగరపాలక పారిశుధ్య అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు జరిపినా ఏపీసీవోఎస్‌(ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌) ఇప్పటివరకు జీతాలు చెల్లించకపోవడంలోని ఆంత ర్యం ఏమిటో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఏపీ చీఫ్‌ సెక్రటరీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో సుమారు 3,500 మంది ఉద్యోగస్తుల ఖాతాలలో సగం నెల పూర్తవుతున్నా జీతాలు పడకపోవడంతో హౌస్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌ చెల్లించక అప్పులు చేసే పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.

ఎస్వీయూలో పదవీ విరమణ చేసిన వాళ్లు సుమారు 700 మంది వయోభారం అనారోగ్యంతో పెన్షన్‌ అందక మందులు కొనుగోలు చేయలేక ప్రాణా లను అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారన్నారు. ఎస్వీ యూనివర్సిటీ, నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు ఉగాది, శ్రీరామ నవమికి చిల్లి గవ్వ లేక పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో పలు విభాగాలలో సుమారు 500 మంది వరకు రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ పనిచేస్తున్నారని సగం నెల పూర్తి కావస్తున్నా బడ్జెట్‌ లేక జీతాలు చెల్లించకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు. ఎస్వీ యూనివర్సిటీ, నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తుల కు పెండిరగ్‌ జీతాలను 24 గంటలలో చెల్లించాలని లేనిపక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.