వైసీపీ మూకల పనేనని టీడీపీ నేతల ఆరోపణ
క్రోసూరులో చంద్రబాబు సభ ముగిశాక ఘటన
పెద్దఎత్తున పార్టీ శ్రేణుల నిరసన
పెదకూరపాడు, మహానాడు న్యూస్: పెడకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి చంద్రబాబు సభ ముగిశాక రాత్రి సుమారు 11-45 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయానికి నిప్పుపెట్టారు. పదిరోజుల కిందట టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నాలుగురోడ్ల కూడలిలోని మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహిం చుకోవడానికి వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దానికి నిప్పుపెట్టడం ఆ పార్టీ నేతల్లో ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఇది ఖచ్చితంగా వైసీపీ మూకల పనేనని టీడీపి నేతలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. దహనమైన కార్యాలయాన్ని పెదకూరపాడు నియోజ కవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సోమవారం పరిశీలించారు. ప్రజాగళం సభ విజయవంతం కావడంతో ఓర్వలేక నిప్పు పెట్టారని, ఇది వైసీపీ నాయకుల పనేనని టీడీపీ కార్యకర్తలు ఘటనా స్థలం వద్ద సోమవారం ధర్నాకు పిలుపునిచ్చారు. అక్కడ నిరసన తెలిపారు. సమీపంలోనే అగ్నిమాపక కేం ద్రం ఉన్నా మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు.