ఇఫ్తార్‌ విందులో పెమ్మసాని, ఆలపాటి, నాదెండ్ల, షరీఫ్‌

గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు న్యూస్‌: తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆదివారం ముస్లిం సోదరుల ి ఇఫ్తార్‌ విందులో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎం.డి.షరీఫ్‌ పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రార్థనలు చేశారు. రంజాన్‌ సందర్భంగా ముస్లిం సొదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని ముస్లింలకు టీడీపీ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.