గుంటూరు, మహానాడు : పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మంగళవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. వారితో పాటు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్రాణం మార్కండేయ బాబు, ఉగ్గిరాల సీతారామయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి విజయమే లక్ష్యంగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో డ్వాక్రా మహి ళలకు పావలా వడ్డీ కింద రూ.5 లక్షల వరకు పరిమితి ఉండేదని, దానిని ఇప్పటి ప్రభుత్వం రూ.3 లక్షలకు తగ్గించిందన్నారు.
గతంలో వైఎస్ ప్రవేశ పెట్టిన అభయహస్తం ప్రస్తుతం నిర్వీర్యం చేశారని తెలిపారు. గతంలో ముస్లింలకు దుల్హన్ పథకం కింద ఎటువంటి ఆంక్షలు లేకుండా 50 వేల ఆర్థిక సాయం ఇస్తే దానిని లక్ష రూపాయలకు పెంచామని చెప్పి 10వ తరగతి ఉత్తీర్ణత అయితేనే పథóకం వర్తిస్తుందని ఆంక్షలు విధించారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వెనిగండ్ల గ్రామంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను లాం నుంచి లిప్ట్ ఇరిగేషన్‌ను తీసుకువచ్చి పరిష్కరించాలని స్థానికులు కోరారు. వెనిగండ్ల గ్రామంలో మురుగునీరు పోక చాలా ఇబ్బందులు పడుతున్నారని, తాము కాల్వలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వెనిగండ్ల గ్రామంలో పశువుల పెంపకం ఎక్కువగా ఉందని, మినీ పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పశుపోషకులు కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వీరేళ్ల వెంకటేశ్వరరావు, వెనిగండ్ల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.