జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి
గుంటూరులో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు
గుంటూరు: అరంగేట్రంతోనే రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ల సునామీని సృష్టించబోతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మార్పు తథó్యమని అందుకే కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయంగా వేసిన తొలి అడుగే చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. ఏడు నియోజకవర్గాలను విజయతీరాలకు చేర్చటంలో పెమ్మసాని పాత్ర కీలకమని కొనియాడారు. పెమ్మసాని విజయం ఖాయమైందని, రికార్డు స్థాయి మెజారిటీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో పాటు అవసరమైతే సొంత నిధులతోనూ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, రెల్లి రాష్ట్ర నేత సోమి ఉదయ్‌కుమార్, కూటమి నేతలు మారుతి కిషోర్, నాజర్ వలి, సయ్యద్ చాంద్, ఎర్రబోతు వాసు, పొగిరి ఫణి, పూసల శ్రీను, కోలా మల్లి, చింతకాయల సాయి, నెల్లూరి శ్రీను, ఖర్జూర శ్రీను, పోతురాజు, మణి, స్టూడియో బాలకృష్ణ, వడ్డె సుబ్బారావు, అడపా బాలకృష్ణ, తేజ, కటకంశెట్టి బాల సైదులు, షంషేర్, క్యాటరింగ్ రమేష్, స్వామి నండూరి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.