వ్యవసాయ కూలీలతో పెమ్మసాని మాటామంతీ

అధికారంలోకి వస్తే ఇళ్లు కట్టిస్తామని హామీ

తుళ్లూరు, మహానాడు: తుళ్లూరు మండల పర్యటనలో భాగంగా సోమవారం పరిమి గ్రామంలో పంట పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను కలుసుకుని పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడారు. కూలీల సమస్యలను, పని సమయం, రోజువారి కూలీ వివరాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారి కూలీలతో జీవనం దుర్భరం గా మారిందని, ఇంట్లోని మగవాళ్లు కల్తీ మద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా కొందరు వాపోయారు. తమకు స్థలాలు ఇవ్వాలని, సొంత ఇల్లు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెమ్మసాని స్పందిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు, వ్యవసాయ కూలీలకు నివాసాలు ఏర్పాటు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.