అల్లు అర్జున్‌ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని

గుంటూరు, మహానాడు : సినీ హీరో అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌, జనసేన నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్‌, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, షర్ఫుద్దీన్‌, సోమి ఉదయ్‌, నాజర్‌ వలి, స్వామి, అబ్దుల్‌ కలాం, షేక్‌ శుభాని, మల్లీశ్వరి, గడదాసు అరుణ, మాదాసు శేఖర్‌, ఏడుకొండలు, జడ సురేష్‌, రజాక్‌, జగన్‌ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.