– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో 100 రోజుల ఎన్డీయే కూటమి పాలన పై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నదని, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు ప్రభుత్వ పనితీరు పై సంతృప్తీ వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గడిచిన 5 ఏళ్ళ కాలంలో ప్రజలు జగన్ రెడ్డి అనే ఓ నియంత చేతిలో నలిగిపోయారని, కనీసం తమ సమస్యలు చెప్పుకోవటానికి ఓ ప్రజాప్రతినిధి కూడా కనిపించే వారు కాదని, నిరసన తెలుపుదామన్న కూడా తీవ్ర వేధింపులకు గురిచేసే వారని ఎమ్మెల్యే గుర్తు చేసారు.
ప్రజాస్వామ్యం చాలా విలువైనదని, నియంతలకు ఇక్కడ చోటులేదని మొన్న ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. నేడు ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటంతో ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా ఇతర రాజకీయ పార్టీలు స్వేచ్చావాయులు పీలుచుకున్నారని గళ్ళా మాధవి తెలిపారు. జగన్ రెడ్డి ఘోర తప్పిదాల వలన వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి, తీవ్ర ఆర్ధిక కష్టాలు వెంటాడిన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుండి అందే జీతాలు,పెన్షనలు ఒకటో తేదీనే అందుతున్నాయని సంక్షేమం,అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని గళ్ళా మాధవి తెలిపారు. రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజి సమస్యలు లేకుండా చూడటమే తన లక్ష్యం అని గల్లా మాధవి తెలిపారు.