డ్రామాలకు దేశ ప్రజలు లొంగరు

-జరిగిన తప్పును ఎలా శిక్షించుకోవాలో మీరే నిర్ణయం చేసుకొండి

పశ్చిమబెంగాల్ ఘటనకు నిరసనగా మమతా బేగం రాజీనామా చేయాలని మొన్నటి రోజున ఏ పార్టీకి చెందని విద్యార్థి సంఘాల ఆందోళన,బాష్పవాయు గోళ ప్రయోగాలు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ కెనాన్సుతో కంట్రోల్ చేయడం లాంటి ఘటనలు చేసినా ప్రజలు కంట్రోల్ కాకపోవడాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు .

నిన్నటి రోజున బిజెపి పార్టీ రాష్ట్ర మొత్తం 12 గంటల బందుకు పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో,ప్రతి ప్రాంతంలో, ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో ఆందోళనలతో,ప్రజలు మమతా బేగం రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున రాష్ట్ర మొత్తం ఒక్కటై ఆందోళన చేసింది.

అసలు మమతా బేగం జరిగిన అతి భయంకరమైన, కిరాతకమైన, జుగుప్సాకరమైన, హేయమైన, నీతి బాహ్యమైన అతి కర్కసంగా, ఆ హాస్పిటల్లో జరుగుతున్న సంఘటనలను ఇక ఏ విద్యార్థి కూడా నోరెత్తి మాట్లాడకుండా భయం కలిగేటట్టుగా అంత భయంకరమైన రేప్ చేశారో, మర్డర్ చేశారో, ఇంకేదైనా చేయరానిది చేశారో, ఆ చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు, నిజాయితీగా పని చేస్తున్న కొంత సిబిఐ వారికి, ఆ భగవంతునికి తప్ప ఇంకొకరికి తెలియదు.

మమతా బేగం మహిళ కదా సాటి మహిళలని కూడా చూడకుండా/లేకుండా పశ్చిమ బెంగాల్లో మహిళలకు జరిగిన సందేశ్ కాళీ ఘటనల మీద కానీ, ఈ ఆ ర్జే కర్ హాస్పిటల్ లో మహిళా డాక్టర్ మీద జరిగిన ఘటనలను మహిళా మానవత్వమైన ఆమెను ప్రశ్నించలేదేమో!ఆమె మనసును ఏ విధంగా శాంతపరుచుకుందో,ఆమె ఆత్మకు ఏ విధంగా సమాధానం చెప్పుకొందో ఆమెకే తెలియాలి .

ఆమెకు తెలియదు తెలియక జరిగింది అనుకోవడానికి ఎక్కడా అవకాశమే లేదు ఎందుకంటే సందేశ్ కాళీ లో జరిగిన ఘటన ఒక రోజుది కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక మహిళకు కాదు ఎంతో మంది మహిళలను చేశారో మీ పార్టీ వాళ్ళు మీవాళ్లు కాబట్టి మీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలిసే అవకాశం లేదు.డైరెక్ట్ గా మీ పార్టీ కార్యకర్తలమని పార్టీ పనికని చెప్పి జరిగిన చేసిన దురాగతాలు మీకు తెలియదా. ఆ ఘోర తప్పిదాలను చేసిన వారిని మీరు రక్షించలేదా! కాపాడలేదా!

ఆ కాలంలో శిశు పాలుడు నూరు తప్పులు చేస్తే శ్రీకృష్ణడు శిక్షించినట్టుగా,మీ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటిని పశ్చిమబెంగాల్ ప్రజలు సహించలేక, భరించలేక ఇక ఈ రాష్ట్రానికి మీరు పనికిరారని నిర్ణయం చేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో ఈ కాలంలో శిక్షలు వేస్తూన్నారు.

ఈ ఆందోళనలకు ఈ శిక్షలకు భయపడి మీరు కొత్త ఎత్తుగడ వేశారు అదేమిటంటే అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది కాబట్టి ఏ మహిళ మీద ఈ విధంగా అన్యాయం జరిగితే ఆ చేసిన వ్యక్తిని పది రోజుల్లో ఉరితీయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి, రాష్ట్రపతి గారి చేత ఆమోదముద్ర పొందాలని మీరు శలవిస్తున్నారు . లేనిచో పార్లమెంట్ ముందు, రాష్ట్రపతి కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయాలని ఆలోచిస్తున్నారు .

అదెలాగో జరగదని మీకు తెలుసు గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆడ పిల్లల మీద జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను ఆ ప్రభుత్వం కట్టడి చేయలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను దిశ చట్టం తీసుకొస్తున్నాను ఆ చట్టం ప్రకారం 15 రోజుల లోపల నిందితుడు శిక్ష పడుతుంది అని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించారు అది ఏమైందో దేశ ప్రజానీకానికి తెలుసు. ఎందుకంటే అటువంటి చట్టాలు చేయాలంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని రకాలు ఇబ్బందులు వస్తాయో, ఎంతమంది జర్నలిస్టుల, అనలిస్టుల పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక నరేషన్ బిల్డ్ చేస్తారో అందరికీ తెలుసు. మీకూ తెలుసు

ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఇండి అసోసియేషన్ లో పార్టీలు ఈ విధంగా కేంద్రానికి వ్యతిరేకంగా మీకు సపోర్టుగా రావడానికి ఉపయోగపడుతుందని వారి మద్దతు కోసం దేశంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు మీద మీరొక్కరే ఉద్యమాలు చేసినట్టుగా నరేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇదొక కొత్త ఎత్తుగడ.

చివరకు మీ ఎత్తుగడలు చూసి భారత రాష్ట్రపతి గారు స్వయంగా ఇక చాలు చాలు అని మాట్లాడారంటే ఆ చాలు వెనక మీ పశ్చిమ బెంగాల్లో మీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలను, ఆకృత్యాలను, ఇప్పటివరకు వాటిని కప్పిపుచ్చుకుంటూ మీరు 97% మీ మతంవారి ఓట్లతో గెలుస్తున్న మోసకారితనాన్ని అంత గమనించి/గ్రహించి రాష్ట్రపతి గారు చాలు చాలు అని మీకు సందేశించారు.

ఈ డ్రామాలు, ఈ ప్రకటనలను పశ్చిమబెంగాల్ ప్రజలు ఇక చూడలేరు ఇంక చాలు అని మీరు నిర్ణయం చేసుకోండి చాలు.

మీ,
కరణం భాస్కర్,
రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు,
7386128877.