– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడి కరుణ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పాలకులకూ ఉండాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణం పూట్టబజార్ 12 వార్డులో మంగళవారం శ్రీ నిదానం పాటి అమ్మవారి ఏడో వార్షికోత్సవం పి.ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె వినాయకుడి విగ్రహం వద్ద లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారాపూసెట్టి పాపారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి, మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. అలాగే తుపాను బాధితులకు అండగా ఉంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్న దర్శి ప్రాంత అన్ని వర్గాలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.