Mahanaadu-Logo-PNG-Large

రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారమని ప్రజలకు అర్థమైంది

-రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
-బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కుమ్మక్కు
-తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ నారాయణరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు కాంతారెడ్డి, భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజేష్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఇతర నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. రెండు పార్టీలు బీజేపీని నిలువరించే ఆలోచనతో జతకట్టారని, వారికి తోడుగా ఎంఐఎం పార్టీ కుమ్మక్కై ఒప్పందంతో భాగంగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం చేస్తూ… తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మజ్లిస్‌ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఓల్డ్‌ సిటీలో ఓవైసీని గెలి పించాలని పార్టీ హైకమాండ్‌ నుంచి ఆదేశాలొచ్చాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఫిరోజ్‌ ఖాన్‌ బహిరంగంగా చెప్పారు. ఇటు కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీ మజ్లిస్‌ పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు డూప్‌ ఫైటింగ్‌ చేసుకుంటూ లోక్‌ సభ ఎన్నికల్లో డ్రామాను రక్తికట్టిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటన అవాస్తమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందని, స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ఈ విషయాన్ని ఖండిరచారని తెలిపారు. రేవంత్‌ రెడ్డికి నైతికత ఉంటే చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.