– ఎమ్మెల్యే ఆంజనేయులు
ఈపూరు, మహానాడు: రైతులను దగా చేసి ముంచిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజలు సరైన గుణపాఠం నేర్పారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. వ్యవసాయ శాఖ ఏడిఏ బి రవిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన రైతును ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలను దోపిడీ కేంద్రాలుగా మార్చుకొని రైతులను నట్టేట ముంచారని విమర్శించారు.
జగన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఏడాదిలో 1300 మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారని తెలిపారు. రైతాంగానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా రైతులను నట్టేయటం వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. 2022-23 ఏడాదికి రైతులకు పంట బీమా చెల్లించలేదని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తించగా రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు గురయ్యారని అన్నారు. ఇన్సూరెన్స్ బకాయి చెల్లించకపోవడంతో రైతులకు 1385 కోట్లు పంట నష్టం బీమా సొమ్ము అందక రైతులు తీవ్రంగానష్టపోయారని అన్నారు. రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన వైసిపి ప్రభుత్వం 1674 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించలేదని, ధాన్యం కొనుగోలు తదితర బకాయిలు 4 వేల కోట్లు చెల్లించకుండా వైసిపి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జనసేన జనసేన ఉమ్మడి జిల్లాల నాయకులు నిశంకర శ్రీనివాసరావు టిడిపి, బిజెపి నాయకులు రాపర్ల జగ్గారావు తిరుమల శెట్టి బాలయ్య అయినాల కోటేశ్వరావు బోడపాటి అంజయ్య గడిపూడి వేణు బొల్లా రామకృష్ణ నర్రా కిషోర్ పాపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు శివరామయ్య, శ్రీనివాసరెడ్డి, రైతులు ఇతర నాయకులు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాటు, వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.