పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

– పాలకుర్తి తిక్కారెడ్డి

పత్తికొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం, పత్తికొండలో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి శాసన సభ్యుడు కె.ఇ.శ్యాం కుమార్ తో పాటు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కా రెడ్డి మాట్లాడుతూ “చెత్త రహిత భారతదేశం” నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతుందని… అందులో భాగంగనే ఈ రోజు పత్తికొండ నియోజకవర్గం, పత్తికొండ గ్రామ పంచాయతిలో జరిగిన కార్యక్రమంలో కె.ఇ.శ్యాం కుమార్ తో కలిసి డ్రైనేజీ కాలువలకి శానిటేషన్, దోమలు పునరుత్పత్తి కాకుండా నీటి నిల్వ ప్రాంతాలలో ఆయిల్ డ్రించింగ్ చేసినట్టు తెలిపారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని, ఆ దిశగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు.