– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. తొలుత గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డులో నూతన జిమ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు వ్యాయమం చేయాలన్నారు. 42వ డివిజన్ ఎస్‌వీఎన్ కాలనీ నారాయణ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వారిలో స్ఫూర్తిని నింపే విధంగా ప్రసంగించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్డులో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జరిగే హాకీ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరయ్యి పోటీలను ప్రారంభించారు.