సూర్యలంక బీచ్ కు అనుమతి

-బాపట్ల రూరల్ సీఐ వై శ్రీహరి..

గత కొంతకాలంగా సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించారు.. చీరాల రామాపురం బీచ్ అలాగే సూర్యలంక సముద్ర తీరంలో కొంతమంది యువకులు గల్లంతవడంతో సముద్ర తీరంలో పర్యాటకులను నిషేధించడం జరిగింది. అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఉత్తర్వులు మేరకు అలాగే వాతావరణ శాఖ సలహా మేరకు బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ లో  బుధవారం నుంచి సందర్శకులను అనుమతించడం జరుగుతుందని బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపారు. కాబట్టి సందర్శకులు సూర్యలంక బీచ్ ని సందర్శించవచ్చు పోలీసు వారి విజ్ఞప్తి పాటిస్తూ ఎవరు కూడా మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరం అలాగే అక్కడ లోతుకు వెళ్లకుండా పోలీసు అధికారులు చెప్పే సూచన సలహాలను పాటించి క్షేమముగా మీ కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి మీ ఇళ్లకు వెళ్లవలసిందిగా కోరడమైనది.