లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులు స‌ర‌ళీకృతం

– మీడియా స‌మావేశంలో మంత్రి నారాయ‌ణ

విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్రంలో లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తుల‌ను నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళీకృతం చేస్తామ‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ఇదే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. రాష్ట్రంలో ప‌లు బిల్డ‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో విజ‌య‌వాడ‌లోని సీఆర్డీఏ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగళవారం మంత్రి నారాయ‌ణ స‌మావేశం నిర్వ‌హించారు. సీఆర్డీయే క‌మిష‌న‌ర్ కాటంనేని భాస్క‌ర్, అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ ల‌క్ష్మీ పార్ధసారధితో పాటు క్రెడాయ్, న‌రెడ్కో, బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా అసోసియేష‌న్ ల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు..

2014 నుంచి 2019 వ‌ర‌కూ బిల్డ‌ర్ల‌కు స్వ‌ర్ణ‌యుగంగా ఉంద‌ని… కానీ గ‌త ప్ర‌భుత్వం తీరుతో తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో మ‌ళ్లీ రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ఊపు వ‌చ్చేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అసోసియేష‌న్ల ప్ర‌తినిధులు కోరారు. నాలా టాక్స్,వేకెంట్ ట్యాక్స్,ఫైర్ అనుమ‌తులు, ఎయిర్ పోర్ట్, టీడీఆర్ బాండ్ల విష‌యాల్లో త‌మ‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను మంత్రి నారాయ‌ణ దృష్టికి తీసుకొచ్చారు. ఆన్ లైన్ అనుమ‌తుల జారీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రి పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా నిబంధ‌న‌ల జారీని స‌ర‌ళీకృతం చేసి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చేస్తామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌..అనుమ‌తుల విష‌యంలో ఇత‌ర రాష్ట్రల్లో అమ‌లవుతున్న నిబంధ‌న‌ల‌ను అధ్య‌య‌నం చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అధికారుల బృందాల‌ను పంపిస్తున్నామ‌న్నారు…టౌన్ ప్లానింగ విభాగంపై సీఎం చంద్ర‌బాబు స్పెష‌ల్ డ్రైవ్ చేయాల‌ని త‌న‌కు చెప్పార‌న్నారు…ఇప్ప‌టికే నెల్లూరు కార్పొరేష‌న్ లో స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించామ‌న్నారు..ఇక‌పై ప్ర‌తివారం ఒక మున్సిపాల్టీలో టౌన్ ప్లానింగ్ ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి డ్రైవ్ చేస్తామ‌న్నారు..బిల్ల‌ర్ల‌కు రెవెన్యూ ప‌ర‌మైన అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నందున టౌన్ ప్లానింగ్ విభాగాన్ని రిజిస్ట్రేష‌న్ విభాగంతో అనుసంధానం చేస్తామ‌ని చెప్పారు..ఇప్ప‌టికే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తో చ‌ర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు. రెండు శాఖ‌ల‌ను ఇంటిగ్రేట్ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు సౌల‌భ్యంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిబంధ‌న‌లు స‌ర‌ళీకృతం చేస్తామ‌ని. ఇదే స‌మ‌యంలో రూల్స్ ను అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు…

అన‌ధికార లేఅవుట్ల‌పై స్పెష‌ల్ ఫోక‌స్

రాష్ట్రంలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా కొంత‌మంది లేఅవుట్ల ను నిర్మిస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ఇలాంటి చోట్ల ప్లాట్ల‌ను కొనుగోలు చేయ‌డం,భ‌వ‌న నిర్మాణాలు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌లు మోస‌పోతున్నార‌ని చెప్పారు..అందుకే అన‌ధికార లేఅవుట్ల స‌ర్వే నెంబ‌ర్ల‌ను పేప‌ర్ లు,టీవీల ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌న్నారు…ఆయా స‌ర్వే నెంబ‌ర్లు రిజిస్ట్రార్ ఆఫీస్ కు ఇవ్వ‌డం ద్వారా ప్లాట్స్ కొనుగోలు చేయాల‌నుకునే వారికి పూర్తి వివ‌రాలు తెలుస్తాయి..దీనికోసం రాబోయే మూడు నెల‌ల్లో ప్ర‌త్యేక వెబ్ సైట్ రూప‌క‌ల్ప‌న చేస్తున్నామ‌న్నారు.

రేప‌టి నుంచి అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు

అమ‌రావ‌తిలో ద‌ట్టంగా పేరుకుపోయిన జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు రేప‌టి నుంచి ప్రారంభం చేస్తున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు..మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు,ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. దీనిద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్నారు..మొత్తం 99 డివిజ‌న్స్ లో ఒకేసారి ప‌నులు ప్రారంభం అవుతాయ‌న్నారు.

ఆర్ – 5 జోన్ వారికి సొంత ప్రాంతాల్లో ఇళ్లు

రాజ‌ధానిలోని ఆర్ – 5 జోన్ లో గ‌తంలో స్థ‌లాలు పొందిన వారికి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించార‌న్నారు..ఎవ‌రికైతే అక్క‌డ స్థ‌లాలు కేటాయించారో వారిని గుర్తించి వారివారి సొంత ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వ‌డం లేదా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామ‌ని చెప్పారు..సీఆర్డీఏలో ల‌బ్దిదారులు ఉంటే వారికి అక్క‌డే ఇళ్లు కేటాయిస్తామ‌న్నారు.