సీఈవో గైడ్‌ లైన్స్‌ పై పేర్ని నాని అభ్యంతరం

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రాష్ట్రంలో లేని వెసులుబాటు ఈ రాష్ట్రం లో ఎందుకు ఇచ్చారు? అని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారు? ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌ లైన్స్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో ఎక్కడా లేని సర్క్యులర్‌ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌? ఈ నిర్ణయంపై పునరాలోచన చేయా లని కోరారు.