-చూపించాల్సింది.. నువ్వు అక్రమంగా నిర్మించుకుంటున్న గోడౌన్లు !
-టిక్ టాక్ లు మానేసి మాకు మంచాలేస్తా అంటున్నాడు
-మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు
మచిలీపట్నం : మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి పేర్ని నాని పై ధ్వజమెత్తారు.. మండల పార్టీ అధ్యక్షుడు కుంచేనాని, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ , మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, సమన్వయ కమిటీ సభ్యులు వాలిశెట్టి తిరుమలరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజాలు మీడియా సమావేశంలో మాట్లాడారు.
మండల పార్టీ అధ్యక్షులు కుంచేనాని మాట్లాడుతూ… దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకొని మమ్మల్ని దొంగలనీ అంటారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలపై నిజంగా మీకు ప్రేమ ఉంటే నిజమైన పట్టాలు పేద ప్రజలకిచ్చి మాట్లాడండి. ఆర్ఎస్ నెంబర్ లేకుండా అధికారులు సంతకాలు లేకుండా రాజముద్రలు లేకుండా ఇళ్ల పట్టాలు ఎవరైనా ఇస్తాడా.. ఇది పేద ప్రజల్ని మోసం చేయడం కాదా? కొల్లు రవీంద్ర ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారని శిలాఫలకాలు చూపిస్తున్నావు.. నువ్వు చూపించాల్సింది మీడియాకు అవికాదు అక్రమంగా నిర్మించుకున్న నీ గోడౌన్లను చూపించు. ఐదేళ్ల నేను కష్టపడి గోడంల నిర్మించాను ఇదే నేను చేసిన అభివృద్ధి అని మీడియాకు దమ్ముంటే.. బందరు నలుమూలల రహదారులు నిర్మించింది కొల్లు రవీంద్ర అయితే, ఆ రోడ్ల మీద తిరుక్కుంటూ ఏం అభివృద్ధి చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తారా?
మత్స్యకారులని రోడ్డును పడేశారు. బందర్లో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి చేసి చూపించింది కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీని. నీ రాజకీయ జీవితానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది త్వరలోనే బందరు ప్రజలు నీకు నీ కుటుంబానికి బుద్ధి చెబుతారు.మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధం .. కోనేరు సెంటర్లో మీరు టైం చెప్పినా సరే మేము టైం చెప్పినా సరే మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.
మేము చేసిన అభివృద్ధి నిరూపించలేక పోతే మీకు క్షమాపణలు చెబుతాం,, మరి నువ్వేం చేస్తావ్ ? ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకున్నావు ఇక నువ్వు చేసేది ఏముంది? ముస్లింలకు ఎంత ద్రోహం చేసావో ఒక్కసారి రా చర్చకు సిద్ధం.