– ఘటనపై హోం మంత్రి అనిత ఆరా
అనకాపల్లి, మహానాడు: ఏపీ.. అనకాపల్లి లోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై
హోం మంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.