– గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడమే యోగా దినోత్సవ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
శుక్రవారం గుంటూరు బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నగర అధ్యక్షులు వనమా నరేంద్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భముగా గళ్ళా మాధవి మాట్లాడుతూ… యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడతాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అన్ని రోగాలకు పరిష్కారం యోగా అని, చిన్నా పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు అనే నినాదంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.