నరసరావుపేట, మహానాడు: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని షరతులు విధించింది. ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే ఉండాలని ఆదేశించింది. దాంతో ఆయన హైకోర్టు అదేశాల మేరకు మంగళవా రం అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన పూర్తి వివరాలు అందజేశారు.