రావణాపల్లి రిజర్వాయర్ దగ్గర గొయ్యి

నర్సీపట్నం, మహానాడు : గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. దీంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. సుమారు 2600 ఎకరాల ఆయకట్టు ఉన్న రావణాపల్లి రిజర్వాయర్ చప్పా దగ్గర సోమవారం గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆర్డీఓ, తహశీల్దార్, ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. రిజర్వాయర్ గేటు ఎత్తి నీటిని వదిలి, గొయ్యిని మట్టితో నింపాలని ఆదేశించారు. ఆదేశాలు అందిన వెంటనే, అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి గొయ్యిని నింపుతున్నారు.