గుంటూరు, మహానాడు: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రజారోగ్య కార్మికుల మస్టర్ పాయింట్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ మేరకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.