Mahanaadu-Logo-PNG-Large

పోలింగ్‌ బూత్‌లో పొన్నూరు వైసీపీ అభ్యర్థి

సిబ్బంది, ఓటర్లకు ప్రలోభాలపై విమర్శలు
ఓటర్లు నిలదీయడంతో బయటకు…

పొన్నూరు, మహానాడు : పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చింతలపూడి గ్రామంలోని 249వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఓటర్లను, పోలింగ్‌ సిబ్బందిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కుమార్తె ధూళిపాళ్ల వైదేప్తి ఆ కేంద్రానికి వెళ్లి పోలింగ్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంబటి మురళీకృష్ణ బూత్‌లో నుంచి బయటకు వెళ్లిపోయారు. మరో వైపు పోలింగ్‌ సిబ్బంది కూడా ఆయనకు కూర్చునే హక్కు ఉందని ఓటర్లతో వాదిస్తూ ఆయనను సమర్థిస్తూ మాట్లాడడం గమనార్హం.