Mahanaadu-Logo-PNG-Large

పొన్నూరు ఆర్వో తీరు బాగా లేదు

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆదేశాలు
  • రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆగ్రహం

గుంటూరు: పొన్నూరు ఆర్వో లక్ష్మీకుమారి ఒంటెద్దు పోకడలపై పార్టీల ప్రతినిధులు మండిపడుతున్నారు. గురువారం వారు విలేఖరుల సమావేశంలో ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో అభ్యర్థి, చీఫ్‌ ఏజెంట్‌లలో ఒక్కరే ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. నచ్చచెప్పాలని నిబంధనలు పాటిం చాలని కోరినా పెడచెవిన పెట్టారు. పోలింగ్‌ రోజున పీవో డైరీలు అదృశ్యమయ్యా యి. 17సీ ఫారాలు గల్లంతు ఘటనతో 2 రోజులు ఆలస్యంగా పోలింగ్‌ శాతం నిర్ధారించారు. ఎన్నికల నియమావళిలో ఆర్‌.వో టేబుల్‌ వద్ద ఏజెంట్లు ఉండి పర్యవేక్షించుకోవాలని చెబుతున్నా ఆ నియమాలు అమలు చేయబోమని భీష్మించు కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసమర్థ నిర్ణయాలతో పోలింగ్‌ రోజు వచ్చిన తలనొప్పిలే కౌంటింగ్‌ రోజున వస్తాయని పార్టీల ప్రతిని ధులు తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నప్పటికీ ఎత్తడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మిర్చి యార్డు ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, పొన్నూరు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ మాదల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌. రామకృష్ణ, పార్టీ నాయకులు మాకిరెడ్డి జయరామిరెడ్డి, దొప్పలపూడి శ్రీనివాస రావు, పాశం నవీన్‌ పాల్గొన్నారు.