ఆదాయ భద్రత పథకంగా మార్చుకున్నారు
సీబీఐ, ఈడీ నుంచి తప్పించుకోలేరు
అవినీతి రాబంధులను జైలుకు పంపుతాం
బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్
మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్, టీడీపీ, జనసేన నాయకులు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. లంకా దినకర్ మాట్లాడుతూ జగన్ కనుసన్నలలో జరిగిన బియ్యం అవినీతి రూ.50 వేల కోట్లు ఉంటుందని అంచనా అని, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చేసిన అప్పు రూ.32 వేల కోట్లలో సింహ భాగం దోచేశారని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికలలో అధికారంలోకి వస్తే జగన్ పేదలకు సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇప్పుడు పేదల బియ్యం గద్దలాగా తన్నుకుపోతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బియ్యం మాఫియా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే… పాత్రదా రులు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర వైకాపా నాయ కులేనని పేర్కొన్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తండ్రి రాష్ట్ర బియ్యం మిల్లుల సంఘం అధ్యక్షుడు, సివిల్ సప్లయీస్ కార్పొరేష న్ చైర్మన్ కావడంతో బియ్యం అవినీతి సులభం అయ్యిందన్నారు. పేదవాడి కడుపు నింపాలని మోదీ గ్యారంటీగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఆహార భద్రత చట్టం కింద సబ్సిడీ ఇస్తుంటే అది వైకాపా నాయకులకు ఆదాయ భద్రత చట్టంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఏపీకి 2.67 కోట్ల మందికి నెలకు ఉచితంగా 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. వైకాపా నాయకులు ఉచిత బియ్యాన్ని రీసైకిల్ చేసి తమ జేబులు నింపుకుంటున్నారన్నారు. పేదల కడుపు కొడుతూ బియ్యాన్ని విదేశాలకు కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ ఎగుమతులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కలుగులో దాగిన బియ్యం అవినీతి రాబంధులను జైలుకు పంపడం తథ్యమని హెచ్చరించారు. పేదల బియ్యంతో వైకాపా నాయకు ల అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకోలేరన్నారు. అవినీతి జలగ జగన్‌ను ఒక నెలలో వదిలించుకుందామని పిలుపునిచ్చారు.