రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపకల్పన
అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు
దర్శి, మహానాడు : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో జనరం జకంగా ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కూటమి మేనిఫెస్టో ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. తెలుగుదేశం గతంలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన మేనిఫెస్టోలో వెల్లడిరచిన షణ్ముఖ వ్యూహం అనే పథకాలను ఉమ్మడిగా అమలు చేసే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత, ఏపీ ఇన్‌చార్జ్ రామ్‌నాథ్‌సింగ్ ఉమ్మడిగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
కూటమిది జనరంజక మేనిఫెస్టో
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
జగన్ మేనిఫెస్టో అబద్ధాల మేనిఫెస్టో. పాత చింతకాయ పచ్చడిలా ఉంది. అందులో పస లేదు అని సొంత పార్టీ వారే విమర్శించారు. జగన్ మేనిఫెస్టో నవ్వుల పాలయింది. అటువంటి మేనిఫెస్టో విడుదల చేసి తన ఓటమిని తానే అంగీకరించారు. అందుకే జన రంజకమైన టీడీపీ కూటమి మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
1.మెగా డీఎస్సీపై తొలి సంతకం
2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000
3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7.రూ.3000 నిరుద్యోగ భృతి
8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి
11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12.ఉచిత ఇసుక
13.అన్నా క్యాంటీన్లు
14.భూ హక్కు చట్టం రద్దు
15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
16.బీసీ రక్షణ చట్టం
17.పూర్ టూ రిచ్ పథకం
18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19.కరెంటు చార్జీలు పెంచం
20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
23.పెళ్లి కానుక రూ.1,00,000/-
24.విదేశీ విద్య పథకం
25.పండుగ కానుకలు