పీఆర్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్
శ్రీకాకుళం అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం, మహానాడు : ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ బుధవారం శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గుండు శంకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధు లకు గౌరవ వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పినందున 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమిని గెలిపించాలని కోరారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకరరావును శ్రీకాకుళం అభ్యర్థిగా, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి కలిశెట్టి అప్పల నాయుడును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్‌ను అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ నాయుడు, జిల్లా అధ్యక్షులు భానోజీనాయుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు రౌతు శ్రీనివాస్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.