సీఎంఓ కార్యదర్శిగా ప్రద్యుమ్న

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
– 19 మంది ఐఏఎస్‌ల బదిలీలు
– భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
– శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవకు పోస్టింగ్ ఇవ్వని సర్కారు
ధనంజయరెడ్డి వర్గీయుడు మురళీధర్‌రెడ్డికి నో పోస్టింగ్
– రాజశేఖర్‌కు వ్యవసాయం
– సాయిప్రసాద్‌కు ఇరిగేషన్
– నమ్మకానికి బాబు పెద్దపీట

అమరావతి: చంద్రబాబునాయుడు సర్కారు పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా తొలిదశలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో జగన్‌భక్త అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవకు పోస్టింగ్ ఇవ్వకపోవడం విశేషం. ఈ ముగ్గురు అధికారులు జగన్ జమానాలో ఒవర్‌యాక్షన్ చేశారన్న విమర్శలుండేవి. కాగా జగన్ హయాంలో సీఎంఓలో ఒక వెలుగువెలిగిన ధనంజయరెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన మురళీధర్‌రెడ్డికి పోస్టింగ్ దక్కలేదు.

కాగా గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు, ఆయన అదనపు కార్యదర్శిగా ఉన్న ప్రద్యుమ్నను ఈసారి ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించారు. గతంలో ఆయన చంద్రబాబుకు నమ్మకంగా పనిచేసేవారు. మంత్రి లోకేష్‌తో కూడా ప్రద్యుమ్నకు సాన్నిహిత్యం ఉండటంతో, ఆయనను సీఎంఓలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక సీఎంఓలోకి తీసుకుంటారని భావించిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్‌ను, జలవనరుల శాఖకు బదిలీ చేశారు. అయితే జగన్‌కు విధేయుడిగా ప్రచారంలో ఉన్న రాజశేఖర్‌కు కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించడం చర్చనీయాంశమయింది. మొత్తానికి ఈ బదిలీల ద్వారా చంద్రబాబునాయుడు నమ్మకానికి పెద్దపీట వేసినట్లు స్పష్టమయింది.

బదిలీల వివరాలు..

ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్‌
ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ జీఏడీకి అటాచ్‌
పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌
జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని మురళీధర్‌రెడ్డికి ఆదేశాలు
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌
పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌
కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌
నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌
ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌
ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి
పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌
గనులశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా తిరుపతి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌
ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు
తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌ చంద్‌