విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చిందని ప్రజలు ప్రశంసిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో నాలుగో రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ 100 రోజుల పాలనపై ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు కేంద్రం సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఓర్వలేని వైసీపీ నేతలు మళ్ళీ జగనే వస్తాడు అంటూ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
జగన్ అంటే కరువు కాటకాలు సంక్షోభం అని, గత 5 ఏళ్ళ పాలన ఒక పీడకలలా ప్రజలు మరిచిపోతే వైసీపీ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారన్నారు. తెలుగు మహిళా నాయకురాలు బంగారు రాధ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రుణాలు 5 నుండి 10లక్షలకు పెంచి, పేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఇది మంచి ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సాల్మన్ రాజు, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, కోలాటపు మాణిక్యరావు, మరియరాణి, కోలాటపు డేవిడ్ రాజు, వీర్నపు వినీల్, ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.