– వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు, మహానాడు: పెదకూరపాడులో ప్రజా దర్బార్ జరిగింది. సోమవారం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టగా, విశేష స్పందన లభించింది. అమరావతి మండలంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో 200 పైగా ప్రజా వినతులు వచ్చాయి. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.