చేతైనేతే మీ కార్యకర్తల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పుకో
మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు
రాప్తాడు, మహానాడు: బలవంతంగా పార్టీ కండువాలు వేస్తే ఎక్కువ రోజులు నిలబడవని.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత హితవు పలికారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మరింత జోరందుకున్నాయి. తాజాగా రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు మండలాల నుంచి సోమవారం సుమారు 110 కుటుంబాల వైకాపా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరారు. తిమ్మాపురం, అనంతపురం, వెంకటాపురం క్యాంపు కార్యాలయాలలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఈ వలసలు చూసి వణికిపోతున్నారన్నారు. రాప్తాడు పంచాయతీ వైకాపా సర్పంచ్ అభ్యర్థి సాకే పెన్నోబులేసు నిన్న టీడీపీలోకి చేరగా బెదిరించి మళ్లీ వైసీపీ కండువా వేశారు. ఆయన తిరిగి టీడీపీ లోకి వచ్చారు. బలవంతంగా వేసే కండువాలు నిలబడవని హెచ్చరించారు. రామగిరి మండలం పెద్ద కొండాపురం, మాదాపురం, కొత్తగాదిగకుంట, కానగలకుంట, కనగానపల్లి మండలం, తగరకుంట గ్రామం, కనగానపల్లి మండలం కే.ఎన్.పాళ్యం గ్రామం నుంచి పెద్దఎత్తున టీడీపీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు.