పాఠశాలలు మూలపడటానికి కారణం ప్రవీణ్

-ప్రవీణ్ ప్రకాశ్, ప్రతాప్ రెడ్డి, రామలింగంను తొలగించాలి
-విద్యాశాఖ మంత్రికి, టీచర్లకు మధ్య బ్రోకర్లా రామలింగం
– మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ

అమరావతి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఎసీసీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య సచివాలయంలో జేడీ సర్వీసెస్గా పని చేస్తున్న రామలింగంను వెంటనే ఆ స్థానాలను నుంచి తప్పించాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు.

117 జీవో ద్వారా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, చాలా పాఠ శాలు మూల పడటానికి, వేల సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరగడానికి కారణమైన ప్రవీణ్ ప్రకాశ్ నాడు-నేడు, విద్యాకానుక పథకాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

2019లో కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భార్యను నిలబెట్టిన ప్రతాప్ రెడ్డి టీచర్లను బెదిరించి, ఓట్లు వేయించుకోవడం, ప్రభుత్వ అధికారి అయి ఉండి, వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం చేశారని ఆరోపించారు.
జేడీ సర్వీసెస్ రామలింగం నాటి విద్యాశాఖ మంత్రికి, టీచ ర్లకు మధ్య బ్రోకర్లా మారి, అక్రమ బదిలీలకు భారీగా నిధులు వసూలు చేశాడని ఆరోపించారు.