తాజ్‌కృష్ణ హోటల్లో వేదికకు ఏర్పాట్లు
వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తల హాజరు
వరి ఎగుమతిదారులకు సువర్ణావకాశం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సదస్సు నిర్వాహకులతో చర్చలు
హైదరాబాద్: వచ్చె నెల 7,8వ తేదీలలో తాజ్‌కృష్ణ హోటల్లో జరిగే ప్రపంచ వరి సదస్సుకు ముమ్మరంగా సన్మాహాలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ (కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్ మెర్సిడెజ్ జోన్స్‌తో పాటు స్థానిక నిర్వాహకులు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శుక్రవారం తుమ్మలను కలిసి సదస్సుకు సంబంధించి న నిర్వహణ అంశాలు వివరించారు. ఈ సదస్సుకు దాదాపు 150 మంది విదేశి వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుంచి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు మరో 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు. వీరితో పాటు రాష్ట్రంలోని దాదాపు 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్ మిల్లర్లు కూడా పాల్గొంటారని తెలిపారు. సదస్సులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలిపారు.
వరి ఎగుమతిదారులకు సువర్ణావకాశం
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మన రాష్ట్రంతో పాటు తర రాష్ట్రాల నుండి వచ్చే వరి ఎగుమతిదారులకు ఇది ఒక మంచి సువర్ణావకాశమన్నారు. ఈ సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు, ఇతర దేశాల నుంచి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరిపుకొనే అవకాశం ఉంటుందని వివరించారు. తద్వారా మనం ఎగుమతిచేసే వరిధాన్యం అనేది ఇతర దేశాల దిగు మతిదారులకు అనుకూలంగా ఉన్నాయా, లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఏఏ దేశాలలో ఏ రకం వరి దిగుమతులకు డిమాండ్ ఉంది? ఎలాంటి నాణ్యతగల వరి రకాలు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి? అన్న విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందని వివరించారు.
సాగులో ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన
దీంతోపాటు ఎలాంటి అధునాతనమైన రైస్ మిల్లర్లు వాడి ఎగుమతికి కావాల్సిన నాణ్యతను పాటించే విధంగా రైస్ మిల్లర్లకు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా వరి పండిరచే అభ్యుదయ రైతులు, ఎలాంటి యాజ మాన్య పద్దతులు పాటించి ఏ రకం వరి పండిరచినట్టయితే ఎగుమతికి అను కూలమైన ధాన్యాన్ని పండిరచవచ్చో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
శాస్త్రవేత్తల నుంచి విత్తనోత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని విత్తన పరిశ్రమ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు తెలుసుకునే అవకాశం కలు గుతుందని వివరించారు. ఈ సదస్సులో భాగంగా దాదాపు 20 విదేశీ, దేశీయ పరిశ్రమలు వారివారి ఉత్పత్తులను, ఎగుమతులకు అనుగుణమైన వరిరకా లను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహిం చబడే ఈ ప్రపంచ వరి సదస్సులో ఇటు వరి విత్తన పరిశ్రమ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, వరి ఎగుమతిదారులు, వివిధ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ప్రతినిధులు పెద్దఎ త్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.