– గుడి ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు
రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువులో 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ ఇరువురు మధ్య జరిగిన ఆధిపత్యం పోరులో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.